Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 8:15 pm Posted by : ramakrishna

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

రుద్రూర్, బతుకమ్మ : జులై 9న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికలోకం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టియుసిఐ రాష్ట్ర కమిటీ నాయకులు బి. మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈపీఎఫ్ కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ 600 నుండి 1000 లోపే వస్తుందని ఇది రాజీనామాలు చేసిన కార్మికులకు వారి వైద్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదని వారి తిండికి ఎట్లా అని ప్రశ్నించారు. అందుకే సి బి టి వారు చెప్పినట్లు కనీస ఈపీఎఫ్ పెన్షన్ 9000 రూపాయల కాడికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా బీడీల పైన కేంద్రం 28%  విధిస్తున్న జీఎస్టీ ని  వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ఇచ్చేటువంటి కనీస వేతనం 500 రూపాయలకు పెంచాలని కోరారు. అట్లాగే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు 26 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెప్పినట్లు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని, నిత్యము పెరిగిపోతున్న సరుకుల ధరలను అదుపులో ఉంచాలని తదితర డిమాండ్ల సాధన కోసం జులై 9 జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సావిత్రి, సునీత, పార్వతి, గంగా, స్వరూప, విజయలక్ష్మి, జూలేకా, లత, పద్మ తదితరులు పాల్గొన్నారు.