Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 7:07 pm Posted by : ramakrishna

ఆగస్టు 1న ధర్నాను విజయవంతం చేయండి

  • యూఎస్ పీసీ నాయకుల పిలుపు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు ఒకటిన జరిగే ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ  పిలుపునిచ్చింది. నిజామాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆగస్టు 1న యూఎస్పీసీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ డీఏ లు వెంటనే మంజూరు చేసి, పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు., ఉపాధ్యాయుల ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని అదేవిధంగా పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పదోన్నతులలో  బీఈడీ వారికి అవకాశం కల్పించాలని అన్నారు. భాషా పండితులలో బీఈడీ వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ట్రెసరర్ ఎన్.రాజారాం, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర బాధ్యులు  విజయ్ కుమార్, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతన్ ,జిల్లా అధ్యక్షులు ఓమాజీ ,పెంటన్న, రవికుమార్, సుధన్ లింగం, సుధాకర్ పాల్గొన్నారు.