మహాసభలను విజయవంతం చేయాలి

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో సీఐటియు ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదో మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్ మాట్లాడుతూ.. ఈనెల 24, 25 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించే రాష్ట్ర ఐదో మహాసభలకు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మచ్కూరి అశోక్, కృష్ణ, శంకర్, సాయిలు, సతీష్, రాంచందర్ పాల్గొన్నారు.