ఛలో అసెంబ్లీ ని విజయవంతం చేయండి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీడీాఎస్యూ ఆధ్వర్యంలో ఈనెల 10న జరగబోయే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీాఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్,డాక్టర్ కర్క గణేష్ కోరారు. నగరంలోని కోటగల్లిలో గల ఎన్.ఆర్.భవన్ (నీలం రామచంద్రయ్య భవన్) లో పీడీాఎస్యూ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీాఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్,డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం...