Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 6:38 pm Posted by : ramakrishna

ఛలో అసెంబ్లీ ని విజయవంతం చేయండి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగ సమస్యల పరిష్కారానికి పీడీాఎస్యూ ఆధ్వర్యంలో ఈనెల 10న జరగబోయే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీాఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్,డాక్టర్ కర్క గణేష్ కోరారు. నగరంలోని కోటగల్లిలో గల ఎన్.ఆర్.భవన్ (నీలం రామచంద్రయ్య భవన్) లో పీడీాఎస్యూ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీాఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్,డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లతో ఈనెల 10 వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్, మెస్, కాస్మోటిక్ చార్జీల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీ.జీ.,  డిగ్రీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో అసంపూర్ణ భవన నిర్మాణాలు, గురుకుల సంక్షేమ వసతి గృహాలకు సొంత భవన నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నూతన జేఎన్టీయూ సబ్ క్యాంపస్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీాఎస్యూజిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, జిల్లా నాయకులు మహిపాల్, నసిర్, రేహాన్, తదితరులు పాల్గొన్నారు.