- వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్
బాన్సువాడ, బతుకమ్మ : బీసీలు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోగలరని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు,బీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు పిట్ల శ్రీధర్ అన్నారు.శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నిర్వ హించే బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఒక వర్గానికి చెందిన వ్యక్తి బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేసిన విషయాన్ని ప్రస్తావి స్తూ,రాష్ట్రంలో 9 శాతం ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేష న్లు ఇచ్చినప్పుడు బీసీలు వ్యతి రేకించలేదని గుర్తు చేశారు.విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీల కు 42% రిజర్వేషన్లు తప్పనిసరి గా ఉండాలని పిట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్, వారాల సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి గాజుల రాజులు, అచ్చుకట్ల జీవన్, గేoట్యాల బాలకృష్ణ, ఉప్పరి లింగం, శంకర్ గౌడ్, కటికే రమేష్, తదితర కులసంగాల నాయకులు, బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.