Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 3:53 pm Posted by : ramakrishna

18న బందును జయప్రదం చేయండి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు కాకుండా కేంద్రం అడ్డుకుంటుందని, దీనికి నిరసనగా 18న జరిగే బందును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు పిలుపునిచ్చారు. జిల్లా బీసీ జేఏసీ నాయకులు సిపిఎం పార్టీ కార్యాలయానికి వచ్చి 18న జరిగే బంధుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్కు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతును ప్రకటిస్తున్నదని అయితే ఈ డిమాండ్ తో రాష్ట్ర అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించకుండా నిర్లక్ష్యం చేయటం సరైనది కాదని అన్నారు. బిజెపి కపట ప్రేమను ప్రదర్శిస్తున్నదని అందువల్ల బీసీ సమాజం అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. బిజెపి పార్లమెంట్ సభ్యులు ద్వందో వైఖరి అవలంబిస్తున్నారని రాష్ట్రంలో బిజెపి రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వం పైన మాత్రం బాధ్యత లేదన్నట్టుగా ఉంటున్నారని రాష్ట్రం నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులు కూడా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన చేసి ఒత్తిడి తేవాలని అందుకు సిపిఎం పార్టీ కలిసి వస్తుందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కొరకు ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బందును జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సహకరించి బందును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు  నాగన్న,  జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, కోచ్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య, నాయకులు నాగరాజ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.