16న 2వ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయండి

వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి.యాదగిరి రావు   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో  జులై 16న ప్రతిష్టాత్మకంగా జరిగే రెండవ స్నాకోత్సవాన్ని విజయవంతం చేయాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు తెలిపారు.  రెండవ  స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో కామర్స్  సెమినార్ హాల్లో  వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ  2006లో 6...