బతుకమ్మ,మోర్తాడ్: ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు నిర్వహిస్తున్న మస్టార్లలో ఏటువంటి తప్పులు దొర్లకుండా చూడాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయి గౌడ్ అన్నారు. గతంలో జరిగిన ఆడిట్లో సైతం మస్టర్లలో తప్పులు దొర్లినట్లు ఈ సంవత్సరం కూడా తప్పులు ఉండడం ఆయన గమనించినట్లు పేర్కొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి, ఏపీ ఓ శకుంతల, ఎస్ఆర్పి రమేష్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.