Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 4:51 pm Posted by : ramakrishna

కబడ్డీ పోటీలను విజయవంతం చేయండి

బతుకమ్మ, నవీపేట్ : నవీపేట్ మండల కేంద్రంలోని నవోదయ జూనియర్ కాలేజ్ లో శుక్రవారం నుండి జరుగనున్న వేములపల్లి కిరణ్ కుమార్ స్మారక కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి నవీన్ కుమార్ కోరారు.  క్రీడలలో మంచి నైపుణ్యం విద్యార్థులను చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడవడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రగతి శీల యువజన సంఘం ఆధ్వర్యంలో నవీపేట మండల స్థాయి విద్యార్థి విద్యార్థులకు క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఈ క్రీడలను విజయవంతం చేయాలని విద్యార్థులకు కోరారు. ఈ కార్యక్రమంలో సాయిలు, హన్మాండ్లు, గంగాధర్, రేహాన్ తదితరులు పాల్గొన్నారు.