Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 1:11 pm Posted by : ramakrishna

సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలి

డీఈవో అశోక్ కుమార్

డిచ్ పల్లి, బతుకమ్మ :  విద్యార్థులు సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అశోక్ కుమార్ అన్నారు. డిచ్ పల్లి జెడ్పీహెచ్ ఎస్ కి పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద రెడ్డి సుమారు రెండున్నర లక్షల విలువైన సైన్స్,  కంప్యూటర్ ల్యాబ్ ల సామగ్రిని  వితరణ చేశారు. ఈల్యాబ్ లను మంగళవారం డీఈవో అశోక్ ప్రారంభించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ  ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.. సైన్స్ టీచర్లతో ల్యాబ్ లో కొన్ని ప్రయోగాలు చేశారు.  అలాగే ల్యాబ్ ను అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, జిల్లా డీసీఈబీ సెక్రటరీ బి.సీతయ్య, డిచ్ పల్లి ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, ఎక్స్ సర్పంచ్ భూస సుదర్శన్ , ఆర్మూర్ గంగాధర్ , అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సావిత్రి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Make good use of the science lab.