సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మహ్మద్ నగర్, బతుకమ్మ: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సవాయిసింగ్ అన్నారు. మహ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామ పంచాయితీ పరిధిలోని రేషన్  షాపును ఆయన పరిశీలించారు. ఈ పథకాన్ని  రేషన్ కార్డు ఉన్న   ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని. నాణ్యతతో కూడిన సన్నబియ్యాన్ని అందజేస్తున్నట్లు  తహసీల్దార్ సవాయిసింగ్ తెలిపారు. రేషన్ షాప్ డీలర్ వెంకటేశం , సిబ్బంది ఉన్నారు.