బీసీ అభ్యర్థులను గెలిపించండి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ మాట్లాడారు. కులాలు, బంధుత్వాలకు అతీతంగా, ప్రలోభాలకు అతీతంగా, మనస్సాక్షిగా బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకుందామని పేర్కొన్నారు. జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న మనకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా కొందరు అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ...