Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 2:01 pm Posted by : ramakrishna

బీసీ అభ్యర్థులను గెలిపించండి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు.  నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం  నిర్వహించిన  విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ మాట్లాడారు.  కులాలు,  బంధుత్వాలకు అతీతంగా, ప్రలోభాలకు అతీతంగా, మనస్సాక్షిగా బీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకుందామని పేర్కొన్నారు.  జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న మనకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా కొందరు అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని పేర్కొన్నారు.  బీసీ లందరూ ఏకమైతే దాదాపు 70% పంచాయతీలను వశం చేసుకోవచ్చన్నారు.  భవిష్యత్తులో దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలన్నారు. ఈకార్యక్రమంలో  ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, వాసం జయ, బసవ సాయి, బాలన్న, సురేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.