Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 5:03 pm Posted by : ramakrishna

బైసఖి పండుగను విజయవంతం చేయాలి

 

. . . సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సిక్కుల నూతన సంవత్సర బైసఖి పండగను ఈ నెల 14 న కంటేశ్వర్ లోని ఫతేగడ్ గురుద్వారా లో జరగనున్నందున సిక్కు సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని సిక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 న గురుద్వార్ లో ఉదయం నుండి భజనలు, కీర్తనలు, మధ్యాహ్నాం భోజనాల ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా సాయంత్రం ఆరు గంటల నుండి కంటేశ్వర్ లోని గురుద్వార్ నుండి ఊరేగింపు (జులూస్) బయలుదేరి ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, తిలక్ గార్డెన్, భగత్ సింగ్ చౌరస్తా, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్ నుండి బర్కత్ పురా మీదుగా బయలుదేరి స్థానిక గాజులపేట్ గురుద్వార్ వద్దకు చేరుతుందన్నారు. అలాగే ఈ పండుగను పంజాబ్, హర్యానా లో రైతుల పండుగగా ఎంతో ఘనంగా జరుపుకుంటారన్నారు. పంటలు బాగా పండి దిగుబడి బాగా రావాలని గురు గ్రంథ సాహెబ్ ను ప్రార్థిస్తారన్నారు.