. . . ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారు నగలు దొంగతనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇంట్లో భారీ చోరి చేసిన సంఘటన బుధవారం నగరంలో ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ 3 లొ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా సాయినగర్ లో నివసిస్తున్నారు. ప్రసాద్ ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ కాగా అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయులు. బుధవారం ఇరువురు ఇంటికి తాళం వేసి విధులకు వేళ్లగా మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని అగంతకులు ఇంటి తాళాలు పగులగొట్టి , బీరువా బద్దలు కొట్టి చోరీ చేశారు. బీరువాలోని 20 తులాల బంగారు నగలు అపహరించారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రసాద్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 25 లక్షల విలువైన బంగారం చోరీకి గురికావడం కలకలం రేపింది. స్థానికంగా విదిలో సిసి కేమారాలు ఉన్నప్పటికి పగలు దొంగతనం జరుగడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.