మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులకు ఎంతో ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజున అధికారిక లాంచనంగా ప్రారంభించింది. ఈ కేంద్రాల ఏర్పాటు పట్ల మండల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి (డీసీఓ) శ్రీనివాసరావు హాజరయ్యారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు తప్పనిసరిగా పొందాలని, ఇందుకోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు....