Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 5:24 pm Posted by : ramakrishna

మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులకు ఎంతో ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజున అధికారిక లాంచనంగా ప్రారంభించింది. ఈ కేంద్రాల ఏర్పాటు పట్ల మండల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి (డీసీఓ) శ్రీనివాసరావు హాజరయ్యారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు తప్పనిసరిగా పొందాలని, ఇందుకోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులు మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలని డీసీఓ శ్రీనివాసరావు కోరారు. .కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో ఇకపై దళారుల బెడద లేకుండా, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర తమకు లభిస్తుందని మండల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో కేంద్రాలను ప్రారంభించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా విక్రయించుకోవచ్చని, తద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కొనుగోలు కేంద్రాలు మోర్తాడ్ ప్రాంత రైతులకు వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను అందించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలెపు నరసయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న  మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిర్మాజీ గోపి, మోర్తాడ్ పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కూ భూమన్న, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, కాంగ్రెస్ నాయకులు జక్కం అశోక్, కోమిరే శ్రీధర్, బాబు, సొసైటీ కార్యదర్శి కాశీరాం తదితర ముఖ్య నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.