ఘనంగా కట్ట మైసమ్మ పండుగ
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో ఆదివారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా కట్ట మైసమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కులాలకు చెందిన కుల పెద్దల సమక్షంలో కట్ట మైసమ్మకు బోనాలు సమర్పించుకున్నారు. అనంతరం కట్ట మైసమ్మ గుడి వద్ద గ్రామంలోని అన్ని కులాల చెందిన వ్యక్తులు మహాబలిదానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండి గ్రామం గా ఉండాలని కోరుతూ కట్టమైసమ్మను వేడుకుంటామని...