Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 11:28 pm Posted by : ramakrishna

దుర్కి కల్తీకల్లు ఘటనలో ప్రధాన నిందితుని అరెస్ట్

బాన్సువాడ, బతుకమ్మ : కల్తీకల్లు తాగి ప్రజలు అస్వస్థకు గురైన ఘటనలో ప్రధాన నిందితుడైన దుర్కి కల్లుబట్టి డిపో యజమాని ఉడుతల లక్మా గౌడ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని తెలిసి కూడా కల్లులో అల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థం కలిపారని తెలిపారు. దీంతో ఆ కల్లు తాగిన ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు కారణమైన నసురుల్లాబాద్ దుర్కి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ఉడుతల లక్ష్మాగౌడ్ ను అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.