మహిళా శక్తి క్యాంటీన్‌  ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ : పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి..  ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, కమిషనర్‌ శ్రీహరి రాజు, నార్ల సురేశ్, కృష్ణారెడ్డి, ఖాలేక్‌, ఎజాజ్‌,...