Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 1:14 pm Posted by : ramakrishna

మహిళా శక్తి క్యాంటీన్‌  ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ : పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి..  ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, కమిషనర్‌ శ్రీహరి రాజు, నార్ల సురేశ్, కృష్ణారెడ్డి, ఖాలేక్‌, ఎజాజ్‌, దాసరి శ్రీనివాస్‌, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.