సభాస్థలిని పరిశీలించిన మహేశ్వర్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగబోయే “రైతు మహా సమ్మేళనం”లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ  ఏర్పాట్లను శుక్రవారం ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట బిజెపి శాసనసభ పక్షనేత, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఉన్నారు.