Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 6:33 pm Posted by : ramakrishna

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ కృషి

  • రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న కృషిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత  నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల పైన  ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ నాయకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తూనే అన్ని వర్గాలను సమానంగా చూస్తున్న నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, డిసిపల్లి అధ్యక్షులు  పోలసాని శ్రీనివాస్, రూరల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్   నిజామాబాద్ రూరల్  నియోజకవర్గ మండలాల  అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.

Mahesh Kumar Goud's efforts to strengthen the party at the grassroots level