Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 7:40 pm Posted by : ramakrishna

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ ఆలీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

 

 

అనారోగ్యం, ప్రమాదాలు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైనచెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యఅతిథిగా హాజరైఅర్హులైన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలబడటం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. అవసరమైన సమయంలో సహాయం అందించడమే నిజమైన పాలనఅని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిజమైన లబ్ధిదారులకు సహాయం అందేలా అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిజామాబాద్ పట్టణం లోని పలు డివిజన్ నుండి వచ్చిన లబ్ధిదారులకు 26 లక్షలు 32 మంది బాధితులకు ఈ చెక్కులు అందించామనిభవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్ మంజూరు అయ్యేలా తన వంతు కృషి కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ఒక గొప్ప వరమని ఆయన కొనియాడారు.గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకంగా, పైసా ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ చెక్కులు అందుతున్నాయని ఆయన తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులను గుర్తించి సహాయం అందిస్తున్నామని చెప్పారు.