Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 7:22 pm Posted by : ramakrishna

పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని కంటేశ్వర్ లోని పట్టణ గౌడ సంఘం, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం-1 లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్, గోవర్ధన్ గౌడ్, డాలర్ శ్రీనివాస్ గౌడ్, నేరోళ్ల శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, అశోక్ గౌడ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

 

Mahesh Goud's birthday celebrations under the auspices of the Pattana Goud Association