మహేంద్రుల సమస్యలను పరిష్కరించాలి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా విగ్రహాల పార్కులోని మహేంద్రుల ఆరాధ్య దైవం కేతయ్య స్వామి విగ్రహానికి గురువారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు, మహేంద్ర సంఘం జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చేతి వృత్తిదారులైన మహేంద్రులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. హరితహారం లో వెదురుని ప్రోత్సహించాలని, అడవులకు రక్షణగా వెదురు వృక్షాలను పెంచాలని, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో...