Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 7:50 pm Posted by : ramakrishna

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలు

బతుకమ్మ, వేల్పూర్ :- మండల కేంద్రంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు మొండి అశోక్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. జ్యోతిబాపూలే బడుగు బలహీనుల ఆశ దీపం సామాజిక ఉద్యమ రూపం శ్రీ విద్యా కోసం తపించిన మహాత్ముడు మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక్  సమాజం ద్వారా అగ్రవర్ణాలపై పోరాటం చేసిన మహాత్ముడు అని వారన్నారు. అణగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం చేసిన మహోన్నత వ్యక్తి చేతువై పూలే అని అన్నారు. వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు దేవల పురుషోత్తం, ఆర్టిఏ జిల్లా మెంబర్ రేగుల రాములు, మాజీ సర్పంచ్ నీరెడ్డి భాగ్య, తీగల మోహన్, మాజీ ఎంపీసీ మొండి మహేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్, కాంగ్రెస్ నాయకులు గౌరాయి నరేందర్, గోపాయి రమణ, మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మోహన్ దాస్, అంబేద్కర్ యువసేన మండల అధ్యక్షులు ప్రభాకర్, గ్రామ కమిటీ కార్యవర్గ సభ్యులు మహేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.