రాష్ట్ర స్థాయి పోటీలకు మహాత్మా జ్యోతిబాఫూలే విద్యార్థులు ఎంపిక
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : అండర్ ` 19 వాలీబాల్, టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయికి పోటీలకు దాస్ నగర్ మహాత్మా జ్యోతిబాఫూలే బిసి గురుకుల విద్యార్థినిలు ఎంపికయ్యారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన అండర్ ` 19 వాలీబాల్‌లో ప్రతిభ కనబరిచిన, అలాగే నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో జరిగిన టేబుల్ టెన్నిస్ అండర్ ` 19 లో ప్రతిభ కనబరిచిన మహాత్మ జ్యోతిబా ఫూలే జూనియర్ కళాశాల, నిజామాబాద్ అర్బన్ దాస్‌నగర్‌కు చెందిన విద్యార్థినిలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లాలో...