Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 6:39 pm Posted by : ramakrishna

రాష్ట్ర స్థాయి పోటీలకు మహాత్మా జ్యోతిబాఫూలే విద్యార్థులు ఎంపిక

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : అండర్‌ ` 19 వాలీబాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ రాష్ట్రస్థాయికి పోటీలకు దాస్ నగర్ మహాత్మా జ్యోతిబాఫూలే బిసి గురుకుల విద్యార్థినిలు ఎంపికయ్యారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జరిగిన అండర్‌ ` 19 వాలీబాల్‌లో ప్రతిభ కనబరిచిన, అలాగే నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో జరిగిన టేబుల్‌ టెన్నిస్‌ అండర్‌ ` 19 లో ప్రతిభ కనబరిచిన మహాత్మ జ్యోతిబా ఫూలే జూనియర్‌ కళాశాల, నిజామాబాద్‌ అర్బన్‌ దాస్‌నగర్‌కు చెందిన విద్యార్థినిలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు ఎ. భవిత, ఆర్‌.పావని, ఎ.పూజ ఎంపిసి, బైపిసి మొదటి సంవత్సరం చదువుతున్నారు. అలాగే టేబుల్‌ టెన్నిస్‌లో ఎంపికైన ఎం.మహేశ్వరి, జి.అక్షయ, డి.ప్రశాంతి, ఏ.స్పందన ఎంపిసి, బైపిసి సెకండ్‌ఇయర్‌ చదువుతున్నారు. వీరిని ప్రిన్సిపాల్‌ ఎం. స్వప్న, పిడి ఎం.నీరజ, పిఇటి పి.పావని అభినందించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థినిల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్నారని ప్రిన్సిపాల్‌ స్వప్న పేర్కొన్నారు.

Mahatma Jyotiba Phule students selected for state level competitions