ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : అభ్యుదయ విశ్వగురువు, సమానతావాది కుల, మత, వర్గ , లింగ భేదాలను ప్రశ్నించిన మొట్టమొదటి సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుని 892 వ జయంతి వేడుకలను బుధవారం అక్షయ తృతీయ నాడు వీర శైవ లింగాయత్ ల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి గ్రామానికి వెళ్ళే దారిలో ఫైర్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి వీరశైవ లింగాయత్ జంగమ ల ఆధ్వర్యంలో నీలకంటేశ్వర ఆలయ పూజారి పెద్ద సంగప్ప, ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు...