Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 7:40 pm Posted by : ramakrishna

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : అభ్యుదయ విశ్వగురువు, సమానతావాది కుల, మత, వర్గ , లింగ భేదాలను ప్రశ్నించిన మొట్టమొదటి సంఘసంస్కర్త  మహాత్మా బసవేశ్వరుని 892 వ జయంతి వేడుకలను బుధవారం అక్షయ తృతీయ నాడు  వీర శైవ లింగాయత్ ల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి గ్రామానికి వెళ్ళే దారిలో ఫైర్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహానికి వీరశైవ లింగాయత్ జంగమ  ల ఆధ్వర్యంలో నీలకంటేశ్వర  ఆలయ పూజారి పెద్ద సంగప్ప, ప్రత్యేక పూజలు చేసి టెంకాయలు కొట్టి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, నాటి సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ విభేదాలను, లింగ వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అని కొనియాడారు. లింగాయత్ ధర్మాన్ని స్థాపించి, సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడు అని, అయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచు కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ జంగమ. అద్యక్షులు ముత్తీ వీరప్ప, ప్రధాన కార్యదర్శి కపిల బసప్ప, గౌరవ అధ్యక్షులు పెద్ద సంగప్ప, సలహాదారులు నాయకోటి శేఖర్, వీర శైవ లింగాయత్ సభ్యులు ముత్తి రామప్ప, అశోక్, మఠం శివ, వీర ప్రసాద్, అనిల్ కుమార్ , మహిళలు రాధిక, శాంత, తదితరులు పాల్గొన్నారు.