Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2024, 5:58 pm Posted by : ramakrishna

పోలీస్ శాఖ ఆద్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని పోలీస్ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్) కోటేశ్వర రావు, అదనపు డి.సి.పి ( లా అండ్ ఆర్డర్ ) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్ ఆధ్వర్యంలో “మహార్షి వాల్మీకి జయంతి ” కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి ఫోటోకు పుష్పగుచ్చాలు సమర్పించారు.
అనంతరం అదనపు పోలీస్ కమీషనర్లు మాట్లాడుతూ శ్రీమ ద్రామాయణ మహాకావ్య సృష్టికర్త మహార్షి వాల్మీకి అనియు, ఒక సామాన్య వ్యక్తిగా అడవిలో పెరిగి, సప్తఋషుల బోధనల ద్వారా మహార్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణం గ్రంధాన్ని మనకు అందించిన మహానీయుడు వాల్మీకి అని, ఆయనను స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆదర్శవంత మైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని తెలియజేశారు. ఈ జయంతి సందర్భంగా ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, రిజర్వుఇన్స్ పెక్టర్స్ మరియు పోలీస్ కార్యాలయం సిబ్బంది, సి.సి. ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది హాజరయ్యారు.