వర్ని రోడ్డుకు మహార్ధశ

రూ.4.50 కోట్లతో డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ – వర్ని రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో వర్ని- నిజామాబాద్ రోడ్డుకు శంకుస్థాపన జరిగిన నిధులు లేని కారణంగా ఆ పనులు నిలిచిపోయాయి. దాంతో నిజామాబాద్ నగరం నుంచి వర్ని రోడ్డులో నగర శివారు వరకు రోడ్డు ఇరుకుగా మారింది. ప్రధానంగా వర్ని చౌరస్తా మొదలుకుని గొల్లగుట్ట తాండ పంచాయితీ వరకు రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్...