Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2025, 5:48 pm Posted by : ramakrishna

ఆశాలకు రూ.18వేల వేతనం చెల్లించాలని మహాపాదయాత్ర

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఆశా వర్కర్లకు రూ.18వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ తెలంగాణ ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లేనియెడల గత ఏడాది సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు ఆశ వర్కర్లు రాష్ట్రంలో నిర్వాదక సమ్మె చేశారని తెలిపారు. ధర్నా సందర్భంగా హెల్త్ డైరెక్ట్ శ్రీనివాస్ రావు ఆశ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారని తెలిపారు.  ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేస్తామని హామీ ఇచ్చరని అన్నారు.  వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న నిరవేదిక సమ్మెను విరమించారని పేర్కొన్నారు. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టిలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం మాట తప్పిన ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహా పాదయాత్రకు వికలాంగుల జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల గంగాధర్, ప్రజానాట్యమండలి సిరిపలింగం, 5వ జిల్లా అధ్యక్షురాలు సుజాత సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రాజ్, లక్ష్మి కాంత్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

Mahapadayatra to pay a salary of Rs.18 thousand to Asha