మహాంతేశ్వర మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ 

పిట్లం, బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గల మహాంతేశ్వర మల్లికార్జున స్వామి గురు మఠం లో  మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో  గురువారం మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సద్గురు మహాంతప్ప, బస్వ లింగప్పమూర్తులకు శిష్యులు పూజలు చేశారు. భాజభజంత్రీలు, వేద మంత్రాలతో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లకి సేవ, ఊరేగింపు పాపేశ్వర మందిరం,ఆంజనేయస్వామి మందిరం దర్శనం చేసుకుని మఠంనకు చేరుకుంది.అనంతరం మఠంలో భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు. మల్లికార్జున శివాచార్యులు కత్...