30న హమాలీల మహాధర్నా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  హమాలీ కార్మికులకు ఉపాధితో కూడిన సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల హమాలీ, మిల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్ టీయూ),  శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. హమాలీలకు కనీస వేనం రూ.26వేలు ఇవ్వడంతోపాటు పీఎఫ్, ఈ ఎస్ ఐ, గ్రాట్యుటీ, బోనస్, ప్రమాదబీమా, 50 ఏళ్లు పైబడిన హమాలీలకు నెలకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలని, ఇండ్లు లేనివారికి పక్కా ఇండ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం గుర్తింపు కార్డులు...