Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 8:13 pm Posted by : ramakrishna

గొల్లపల్లి లో మహా సంపర్క్ అభియాన్

ఎల్లారెడ్డిపేట  బతుకమ్మ :బిజెపి మహా సంపర్క్ అభియాన్ లో భాగంగ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో  29వ బూతు అధ్యక్షుడు పొన్నాల వెంకటేష్, 28వ బూత్ తేజశ్రీ,27బూత్ దాసరి పవన్,26 వ బూత్ ఆకుల సాగర్ ఆధ్వర్యంలో  ఇంటింటికి బిజెపి, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు వెళ్ళి  ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధినీ వివరిస్తూ  కేంద్ర ప్రభుత్వం   ప్రవేశపెట్టిన పథకాలను ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన  పథకాలను ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం తీసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు రైతు సంక్షేమము,నారీ శక్తికి కొత్త ఉత్తేజం 33శాతం రిజర్వేషన్ల కల్పన, మధ్యతరగతికి జీవన సులభతరం, 12.750 లక్షల వరకు ఆదాయపై సున్నా ఆదాయపన్ను, అందరికీ అందుబాటులో ఆరోగ్యం, ఆయుష్మాన్ భారత్, దేశ భద్రతకే తొలి ప్రాధాన్యత, ప్రపంచ ఆర్థిక శక్తి, భారతదేశ సాంకేతిక యుగం, పర్యావరణ, సుస్థిర అభివృద్ధి పాలన, పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన, పీఎం  కిసాన్ యోజన, బేటి బచావో బేటి పడావో, సుకన్య సమృద్ధి యోజన, వంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి దేశ ప్రజలందరికీ బిజెపి ప్రభుత్వం మేలు చేస్తుందని వివరిస్తూప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాల పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ,ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్, జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు పిట్ల శ్రీశైలం, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మాలోత్ కిరణ్ నాయక్ ,మండల ఉపాధ్యక్షులు మల్లారపు మహేశ్, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు గంట బాలకృష్ణ, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మూడవత్ రవి నాయక్, దండు నవీన్, బూత్ కమిటీ సభ్యులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Maha Sampark Abhiyan in Gollapalli