కాశీ విశ్వనాథునికి మహా రుద్రాభిషేకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీలోని తన నివాసంలో శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ విశ్వనాథునికి భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు పాల్గొని, శాస్త్రోక్తంగా మహాదేవునికి  గంగాజలంతో, పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు " ఇందూర్ జిల్లా ప్రజల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి, లోక కళ్యాణం కోసం ఈ రుద్రాభిషేకాన్ని  గత 50 ఏళ్లనుండి నిర్వహించడం...