Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2025, 7:23 pm Posted by : ramakrishna

కాశీ విశ్వనాథునికి మహా రుద్రాభిషేకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీలోని తన నివాసంలో శ్రావణ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని కాశీ విశ్వనాథునికి భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు పాల్గొని, శాస్త్రోక్తంగా మహాదేవునికి  గంగాజలంతో, పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ” ఇందూర్ జిల్లా ప్రజల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి, లోక కళ్యాణం కోసం ఈ రుద్రాభిషేకాన్ని  గత 50 ఏళ్లనుండి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలు నిర్వహించడం వలన మన సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించడంతో పాటు మనశాంతి, దృఢ సంకల్పం కలుగుతుందన్నారు. మహాదేవుని  ఆశీస్సులతో సమాజం శాంతిగా, సుసంపన్నంగా ఉండాలి. ప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకున్నట్లు”  తెలిపారు. వేద ఘోషల నడుమ ఎంతో ఆధ్యాత్మికతతో సాగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.