Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2024, 12:39 pm Posted by : ramakrishna

‘మహా’ ఎంపీ వసంత్ రావు చౌహాన్ మృతి

. హైదరాబాద్ ‘కిమ్స్’లో చికిత్స పొందుతూ కన్నుమూసిన నేత

బతుకమ్మ, హైదరాబాద్ : మహారాష్ట్రలోని నాందెడ్ పార్లమెంటు సభ్యుడు వసంత్ రావు చౌహాన్ సోమవారం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలి కిమ్స్ లో గత పదిరోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర ఇన్ చార్జి  డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ కిమ్స్ కు వెళ్లి చౌహాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చౌహాన్ ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి సంపత్ కుమార్ కిమ్స్ వైద్యులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.