వికలాంగుల, చేయూత పింఛనుదారుల మహా గర్జన సన్నాహక సభ

బతుకమ్మ, బోధన్ : బోధన్ ఇరిగేషన్ విశ్రాంతి భవనంలో నియోజక ఇన్‌ఛార్జి  లసింగారి భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం మాట్లాడుతూ ఈ నెల 23న బోధన్ అయేషా గార్డెన్‌లో మహా గర్జన సన్నాహక సభ జరుగుతుందని, దీనికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వం పింఛన్ల పెంపుపై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొడాలి స్వామి మాదిగ, కనక ప్రమోద్ మాదిగ, సలీం, తాడెం అబ్బయ్య...