కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మహా ధర్నా

బతుకమ్మ, భిక్కనూరు : కాలేశ్వరం ప్రాజెక్టు పై కేసీఆర్ పై సిబిఐ విచారణకు ఆదేశించడానికి వ్యతిరేకిస్తూ భిక్కనూరు చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి కుట్ర పూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. కెసిఆర్ హయాంలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈరోజు రైతులు సుఖశాంతులతో ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కూడా రైతులకు ఇవ్వని ప్రభుత్వం కెసిఆర్...