Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 2:56 pm Posted by : ramakrishna

కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మహా ధర్నా

బతుకమ్మ, భిక్కనూరు : కాలేశ్వరం ప్రాజెక్టు పై కేసీఆర్ పై సిబిఐ విచారణకు ఆదేశించడానికి వ్యతిరేకిస్తూ భిక్కనూరు చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి కుట్ర పూరితంగానే ఈ నిర్ణయం తీసుకున్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. కెసిఆర్ హయాంలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈరోజు రైతులు సుఖశాంతులతో ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కూడా రైతులకు ఇవ్వని ప్రభుత్వం కెసిఆర్ పైన నిందల   ఇప్పటికైనా రైతులకు సకాలంలో యూరియా బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణు మాజీఎంపీటీసీ సాయి రెడ్డి, స్వామి అత్తిలి శ్రీనివాస్, బుర్రి గోపాల్, ప్రభాకర్ చంద్రయ్య, రవి, సాయి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.