ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి మందిరం సన్నిధిలో కమ్మరి నర్సయ్య సునీత దంపతుల కుటుంబం శనివారం లక్ష్మీనరసింహస్వామి మూర్తులకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తాము కోరుకున్న కోరిక నెరవేరినందున సంతోషంగా ఉందని వారు అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ లోకని గంగామని గంగారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాసేవలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నర్సయ్య సునీత దంపతులను అభినందించారు. గ్రామ ప్రజలు లక్ష్మీనరసింహస్వామి మందిరానికి వచ్చి మొక్కులు చెల్లించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదర్ పెద్ద మనిషి దాసరి అంజయ్య, తొగరి ధర్మవ్వ, తొగరి నర్సయ్య, గన్నారం చిన్న నరసయ్య, యువకులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.