Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 3:55 pm Posted by : ramakrishna

దుర్గ మాత సన్నిధిలో మహా అన్నదానం

ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మాత పండగను పురస్కరించుకొని నాలుగవ రోజు గురువారం గ్రామంలోనీ మీది వాడ,భవాని కమిటీ ఆధ్వర్యంలో గంగపుత్ర ఫంక్షన్ హాల్ లో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గా మాత దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకొని మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని మీదివాడ భవాని కమిటీ వారు ఏర్పాటు చేశారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు గ్రామ ప్రజలకు స్వాములకు అందరికీ భవాని కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు,అమ్మవారి మాల భక్తులు, తదితరులు పాల్గొన్నారు.