మద్నూర్, బతుకమ్మ : మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు భాగంగా సోమవారం ఆలయ ఆవరణంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆశీస్సులతో మహా అన్న ప్రసాదాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేకు సన్నిహితులైన హనుమాన్లు గురుస్వామి ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రారంభించారు.