Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 6:26 pm Posted by : ramakrishna

హనుమాన్ ఆలయంలో మహా అన్నదానం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్  నగరంలోని గురుద్వార్ దగ్గర హనుమాన్ ఆలయంలో గత ఐదు సంవత్సరాల నుండి ఈ మహా అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎడ్ల  పొలాల అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం తీసుకున్నారు. ఎర్ర హనుమాన్ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు బజరంగ్ , కృష్ణ పాటేల్, దీపక్ పాటిల్, జైపాల్, అశోక్,రఘు సిద్ధుల, తదితరులు నిర్వహించారు.