బతుకమ్మ, నవీపేట్ : మండలంలోని నాళేశ్వర్ ప్రాథమిక పాఠశాల క్యాలేండర్ ను సోమవారం బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రైవైట్ పాఠశాలకు దీటుగా నాళేశ్వర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్న ప్రధానోపాద్యయుడు శ్రీ పాద్ గారికి ప్రత్యేక ఆభినందనలు తెలుపుతూ,పిల్లలకు విద్యలోనే కాకుండా, క్రీడా రంగంలో జిల్లా స్థాయి లో రాణించేలా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందానికి కుడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీపాద్,పాఠశాల చైర్మన్ లక్ష్మి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు,మాజి సర్పంచ్ ద్యాగ సరిన్,గ్రామాబివృద్ది కమిటి సభ్యులు లక్ష్మణ్,రాజేందర్,రాజు ,ఆక్లేష్,యువజన నాయకులు చిన్నదోడ్డి ప్రవిణ్,శేఖర్,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు