Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 6:50 pm Posted by : ramakrishna

మద్నూర్ తహసీల్దార్ కార్యాలయం తనిఖీ

బతుకమ్మ,మద్నూర్: మండల తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆఫీస్ రికార్డులను, కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.  మండలంలోని భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీ.ఓ.ఎం.ఎస్. నెం.81 & 85 తేదీ: 24-07-2023 ప్రకారం 3797 మంది 61 సం”లు వీఆర్ఏ లా వారసులకు త్వరగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కోప్పిశెట్టి కు అందించారు. మండల తాహసిల్దార్ ఎండి ముజీబ్, గిర్ధవర్ శంకర్, వీఆర్ఏ లా వారసులు తాహసిల్దార్ సిబ్బంది తదితరులు ఉన్నారు.